- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ దర్శకుడు శ్రీకీర్తన్ కుమారుడి దుర్మరణం.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
by Ramesh Naini |
ప్రముఖ దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీకీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసిందని తెలిపారు. శ్రీకీర్తన్, సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ దుర్మరణం పాలయ్యాడు. నాలుగున్నరేళ్ల సోనార్ష్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో శివైక్యం చెందిన విషయం తెలిసి తీవ్ర మనస్థాపానికి గురయ్యానని తెలిపారు. శ్రీ కీర్తన్, సమృద్ధి దంపతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పుత్ర శోకం నుంచి తేరుకొనే మనో ధైర్యాన్ని ఆ దంపతులకు ఇవ్వాలని పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. ప్రకటన ఇదే..
Next Story






