- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హలో అంటూ క్యూట్ ఫొటో షేర్ చేసిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. చబ్బీ గర్ల్ అంటూ నెటిజన్ల కామెంట్స్
చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించిన హీరోయిన్ నివేదా థామస్(Nivedha Thamas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించిన హీరోయిన్ నివేదా థామస్(Nivedha Thamos) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత హీరోయిన్ మారి మరింత ఫేమ్ తెచ్చుకుంది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఈ అందాల తారకు క్రేజ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల ‘35 చిన్న కథ కాదు’(35 Chinna Katha Kaadu) సినిమాతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి(Vijay Sethupathi) సరసన ఓ మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ పక్క సినిమాలతో నివేదా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు తన ఎక్స్(X)లో ఓ ఫొటో షేర్ చేస్తూ హలో అనే క్యాప్షన్ జోడించింది. ఆ పిక్‌లో నివేదా మేకప్ లేకుండా చాలా సింపుల్‌గా చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. ఇక ఈ ఫొటో పై నెటిజన్లు చబ్బీ గర్ల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






