Pawan Kalyan: పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ‘ది 100’ ట్రైలర్ రిలీజ్.. టీమ్ రియాక్షన్ ఏంటంటే?

by Chukka Sudharani |   (  Updated:2025-07-05 15:27:03  IST  )

మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ (RK Sagar).. ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది 100’.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ‘ది 100’ ట్రైలర్ రిలీజ్.. టీమ్ రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ (RK Sagar).. ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ‘ది 100’ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న చిత్ర బృందం.. తాజాగా ‘ది 100’ ట్రైలర్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ చేయించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ‘ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం.. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మన సొంత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ది 100’ సినిమా యెక్క ఇన్‌టెన్స్ అండ్ గ్రిప్పింగ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆయన పవర్ ఫుల్ ప్రజెన్స్ అండ్ మంచి మాటలు The100 ట్రైలర్‌పై అండ్ సినిమా ప్రయాణంపై ఎంతో ఎనర్జీని ఇచ్చాయి’ అంటూ షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. Link

Next Story