- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: రాజమౌళి డైరక్షన్లో వచ్చిన ఆ బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన పవన్ కల్యాణ్.!
హిస్టరీ చూసుకంటే .. ప్రతీ సినిమా బ్లాక్ బస్టరే.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్న రాజమౌళి ( S. S. Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆయన సినీ కెరియర్లో ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు.అలాంటి వారిలో మనకు ముందు గుర్తొచ్చేది రాజమౌళినే. మరి, ఇలాంటి డైరెక్టర్ తో సినిమా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు.. అవకాశం రావాలే కానీ, ఏ నటుడు అయినా కమిట్ అవుతాడు. హిస్టరీ మొత్తం చూసుకంటే .. ప్రతీ సినిమా బ్లాక్ బస్టరే. ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న డైరెక్టర్ నుంచి మూవీ ఆఫర్ ఇస్తే ఆ స్టార్ హీరో నో చెప్పారట. మరి ఆయనెవరు? ఎందుకు నో చెప్పారో ? ఇక్కడ తెలుసుకుందాం..
ఇప్పటివరకు, రాజమౌళి కొన్ని సినిమాలను డైరెక్షన్ చేశారు. ఇందులో, ఒక్క మూవీ కూడా ఫ్లాప్ అయింది లేదు. తీసిన ప్రతి మూవీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచాయి. అంతటి క్రేజ్ వున్న రాజమౌళి నుంచి మూవీ ఆఫర్ ఇస్తే ఆ హీరో రిజెక్ట్ చేశాడు. ఆ సినిమానే " సై " ( Sye ) నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అప్పటివరకు ఎవరికీ తెలియని రగ్బీ ఆటను జక్కన్న అందరికీ తెలియజేశారు.
అయితే, ఆ సినిమాలో నితిన్ ( Nithiin ) కంటే ముందు వేరే హీరోని అనుకున్నారట రాజమౌళి. ఆ హీరో మరెవరో కాదు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) . ఈ స్టోరీని ముందుగా పవన్ కు వినిపించగా కథ మొత్తం విన్నాక ఇది చాలా డిఫరెంట్ గా ఉందని వెంటనే నో చెప్పారట. పవన్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా నితిన్ వరకు వెళ్ళింది. అప్పటికే జయం, దిల్ వంటి మూవీస్ తో హిట్స్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్న నితిన్ ఈ సై మూవీతో హ్యాట్రిక్ కొట్టిన హీరో గా రికార్డ్ క్రియోట్ చేశాడు.






