ఖండాలు దాటిన డిప్యూటీ సీఎం క్రేజ్.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-04 12:27:42  IST  )

టాలీవుడ్(Tollywood) హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Power Star Pawan Kalyan)కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

ఖండాలు దాటిన డిప్యూటీ సీఎం క్రేజ్.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Power Star Pawan Kalyan)కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హిట్‌లు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన పేరు చెబితేనే చొక్కాలు చింపుకునే అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం(Deputy CM of Andhra Pradesh)గా ప్రజలు ఆయనకిచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన సినిమాలేం లేవని బాధపడుతన్న అభిమానులకు పొలిటికల్‌గా రోజూ క్రేజీ డైలాగ్స్‌తో నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. ఇటీవల రేషన్ బియ్యం( Ration Rice) అక్రమ రవాణా అడ్డగింతలో భాగంగా ‘సీజ్ ద షిప్’(Seize the ship) అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన మాట ఏ రేంజ్‌లో వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు.

ఏకంగా ‘సీజ్ ద షిప్’ అనే పదాన్ని మూవీ టైటిల్‌గా ఓ నిర్మాత(Tollywood Producer) రిజిస్టర్ చేసుకున్నాడంటే.. పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోచ్చు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాను ఆయా భాషల్లో రీమేక్స్ కూడా చేసి హిట్‌లు కొట్టారు. తాజాగా ఆయన క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ఆఫ్రికా(Africa)లోని ఓ బస్టాండ్‌లో బస్సులకు ఆయన పోస్టర్లు అంటించారు. ఇటీవల బస్సులపై పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ పోస్టర్స్‌(Gabbar Sing Movie Posters)ను గమనించిన అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేశారు.

ఆ పోస్టు కింద పవన్ కల్యాణ్‌ క్రేజ్ శాశ్వతం, ఆయన మీదున్న అభిమానానికి హద్దులు, సరిహద్దులు ఏమీ ఉండవు అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ ఒప్పుకున్న సినిమాల్లో ఓజీ(OG), ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh), హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) ఉన్నాయి. ఓజీకి సుజిత్, ఉస్తాద్‌కు హరీష్, వీరమల్లుకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. వీరమల్లు షూటింగ్ దాదాపు పూర్తి కాగా సమ్మర్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇక ఓజీ 50 షూటింగ్ పూర్తి చేసుకోగా.. దసరాకు విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నారు. ఇక ఉస్తాద్ షూటింగ్‌ చాలా వరకు పెండింగ్‌లో ఉండటంతో వచ్చే ఏడాదే విడుదల అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.


బీజేపీ కీలక నిర్ణయం.. ఢిల్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో ప్రచారం??

Next Story