- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG: ఫైనల్‌గా ఓజీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పవర్ ఫుల్ పోస్టర్‌తో ఆనందంలో ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో, సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి అభిమానుల కోసం బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 21న ఉదయం 10:08 గంటలకు రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘డెత్ కోటా.. కన్ఫర్మ్ అంటా’ అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్‌తో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
కాగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, షాన్ కక్కర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న థియేటర్స్ విడుదల కాబోతుంది.






