- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan V/S Allu Arjun: అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ నో అపాయింట్‌మెంట్!
మెగాస్టార్ - అల్లు ఫ్యామిలీ మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏర్పాడిన మనస్పర్థాలు ఇంక సమసిపోయినట్లు కనిపించడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ - అల్లు ఫ్యామిలీ మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏర్పాడిన మనస్పర్థాలు ఇంక సమసిపోయినట్లు కనిపించడం లేదు. రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప-2 ప్రిమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 12 గంటల్లోనే ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బన్నీకి సినీ ప్రముఖుల నుంచి పరామర్శలు వెల్లువెత్తాయి.
బన్నీ అరెస్ట్ కాగానే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు అల్లు ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారు. జైలు నుంచి రిలీజై ఇంటివెళ్లిన తర్వాత కూడా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్‌ను కలిసింది. కానీ ఏపీ డిఫ్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్‌ను కలవలేదు. బన్నీ కలిసేందుకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చారు. కానీ ఆయన అల్లు అర్జున్ ఫ్యామిలీని కలవలేదు. ఎన్నికల సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి వైసీపీకి చెందిన అభ్యర్థి పక్షాన బన్నీ ప్రచారం చేయడంతోనే పవన్ కళ్యాణ్ తీవ్రంగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రస్తుతం అల్లు అర్జున్ ఇష్యూలో పవర్ స్టార్ సీరియస్‌గా ఉన్నారని సమాచారం. మరోవైపు తొక్కిసలాటలో మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉండటం పవన్ మనసును తీవ్రంగా కలిచివేసిందని జనసైనకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇష్టపడటం లేదని, కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటంలేదని తెలుస్తోంది. మరి ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఎక్కడి వరకు దారి తీస్తోందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే..
Read More...
pushpa-2: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ.. 14 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?(పోస్టర్)






