- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం తొలిప్రేమ(Tholi Prema Movie).

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం తొలిప్రేమ(Tholi Prema Movie). ఏ. కరుణకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో యువతను ఓ ఊపు ఊపింది. నెల కాదు.. రెండు నెలలు కాదు ఏకంగా ఈ సినిమా సంవత్సరం పాటు థియేటర్లలో విజయవంతంగా ఆడింది. ఫైనాన్షియల్‌గా కూడా పవన్ కల్యాణ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు. రేపు జూన్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కొన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. 1998లో ఈ సినిమా విడుదల కావడం గమనార్హం. ఇందులో పవన్ కల్యాణ్ సరసన కీర్తి రెడ్డి(Keerthi Reddy) నటించారు. దేవా సంగీతం సమకూర్చారు. వై.మహిధర్ మరియు చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును, ఆరు రాష్ట్ర నంది అవార్డులను ఈ చిత్రం గెలుచుకుంది. జీవీజీ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.






