- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు ఇష్టం లేదు.. రత్నం గారి కోసం ప్రెస్ మీట్: పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రెస్ మీట్ ప్రారంభం అయింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా ప్రెస్ మీట్ ప్రారంభం అయింది. హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో ఈ ప్రెస్ మీట్ (Press meet) నిర్వహించగా.. హీరో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొలిటికల ఎంట్రీ తర్వాత.. పోడియం లేకుండా.. మాట్లాడటం వింతగా అనిపిస్తుందని అన్నారు. చాలా రోజుల తర్వాత ఇలా సినిమా ఈవెంట్ లో పాల్గోన్నానని.. పోడియం లేకుండా మాట్లాడుతుంటే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.
అలాగే ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre-release event) ఉన్నప్పటికి.. ప్రెస్ మీట్ పెట్టడం తనకు ఇష్టం లేదని, కానీ ఏఎమ్ రత్నం (AM Ratnam) గారి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీడియా మిత్రులతో ఇంత క్లోజ్ గా మాట్లాడలేనమనే కారణంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని పవన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా చిత్రీకరణ యూనిట్ చేసిన కృషిని ప్రశంసించారు. ఈ సినిమా కథ నిర్మాణంలో క్రిష్ కీలక పాత్ర పోషించాడని, ఆయనకు తాను ప్రత్యేక కృతజ్ఙతలు చెబుతున్నానని హీరో పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Also Read:
సినిమా నా బిజినెస్ కాదు.. అందరు హీరోలలో నేను ఒకడిని: పవన్ కల్యాణ్






