హరిహర వీరమల్లు కథ లీక్ చేసిన పవన్ కళ్యాణ్!

by velandi.Saikiran |   (  Updated:2025-07-21 07:32:23  IST  )

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లోనే

హరిహర వీరమల్లు కథ లీక్ చేసిన పవన్ కళ్యాణ్!
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లోనే విడుదల కానున్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ సమయం లేకపోవడంతో స్వయంగా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరిహర వీరమల్లు కథ లీక్ చేశారు పవన్ కళ్యాణ్. కృష్ణ నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూరు వజ్రం హైదరాబాదు సుల్తానుల వద్దకు ఎలా వచ్చింది ? దాని ప్రయాణం ఎటు వెళ్లిందనేదే సినిమా కథ అంటూ.. పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు పునాది వేసింది దర్శకుడు క్రిష్ అంటూ వ్యాఖ్యానించారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు పవన్ కళ్యాణ్.

ఎం ఎం కీరవాణి తన మ్యూజిక్ తో ఈ సినిమాకు ప్రాణం పోసాడని.. ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్... ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంటే నాకే సిగ్గేసిందని ఎమోషనల్ అయ్యారు. ఆమెను అనాధలా వదిలేసామా ? అనిపించి నేనే ప్రమోషన్ కు దిగి వచ్చినట్లు వెల్లడించారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read:

నా సినిమా కోసం ఆమె చేస్తున్న కష్టం చూసి నాకు సిగ్గేస్తోంది: పవన్ కళ్యాణ్

Next Story