- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు.. క్లారిటీ ఇచ్చిన రీతు చౌదరి.. వీడియో వైరల్
బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss-9) చివరి దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో ఫినాలేకు చేరుకోనున్న ఈ సీజన్ రేండు వారాల్లో షో పూర్తి కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss-9) చివరి దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో ఫినాలేకు చేరుకోనున్న ఈ సీజన్ రేండు వారాల్లో షో పూర్తి కానుంది. నిర్వాహకులు ఊహించని మార్పులు చేసినప్పటికీ .. కొందరు కంటెస్టెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా ఇంట్లో ఇంకా ఏడుగురు ఉన్నారు. ఇక ఈ వారం అనూహ్యంగా ఓట్లు తక్కువ రావడంతో రీతూ చౌదరి(Reethu Chowdary) బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ చిన్నది వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన విషయాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పడాల అమ్మాయిల పిచ్చోడు అంటగా, స్టార్టింగ్‌లో అమ్మాయిలను టచ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడని బయట చాలా టాక్ వచ్చింది.. ఆ పచ్చళ్లు అమ్ముకునే అమ్మాయి కూడా బయటికి వచ్చాక అదే చెప్పింది అని అన్నాడు.
దీనికి రీతు చౌదరి మాట్లాడుతూ.. ‘ఛీ ఛీ అస్సలు అతను అలాంటి వాడు కాదు. అమ్మాయిల పిచ్చోడు అనే మాట నిజం కాదు. మనం పక్కన ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడతామో అతను కూడా అలానే మాట్లాడతాడు.. దానికే అమ్మాయిల పిచ్చోడు అని అనడం కరెక్ట్ కాదు. మరి ఆ రమ్య అలేఖ్య అలా ఎందుకు అన్నదో ఆమెకే తెలియాలి’ అని అన్నది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Read More..






