- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సనాతన ధర్మం అంటే అదే.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వైజాగ్‌లో నిర్వహించిన హరిహరవీరమల్లు ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేడుకలో సనాతన ధర్మం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: వైజాగ్‌లో నిర్వహించిన హరిహరవీరమల్లు ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేడుకలో సనాతన ధర్మం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పారు. క్రైస్తవులు, ముస్లీంలకు సనాతన ధర్మం వ్యతిరేకం కాదన్నారు. ఇది మనందరిని కలుపుకుని తీసుకెళుతుందని వ్యాఖ్యానించారు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని, రికార్డులు బద్దలు కొట్టాలని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. సర్వస్వతీ దేవిని ప్రార్థిస్థానని, కృష్ణుడిని నమ్ముతానని అన్నారు.
కర్మ చేయాలని ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలన్నారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తున్నామని చెప్పారు. గతంలో తన సినిమాల టికెట్ ధరలు పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని కానీ చంద్రబాబు టికెట్ ధరలను పెంచారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తాను వైజాగ్ లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నానని చెప్పారు. అలా చెబితే పవన్ ఎక్కడికి వెళితే అక్కడ పెరిగానని అంటాడని తాను పవనాన్ని అని అన్ని ప్రాంతాల్లో తిరుగుతానని సమాధానం ఇచ్చారు.






