- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మా జీవితాల్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు’.. పవన్ కల్యాణ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటి ప్రణీత (Praneetha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి ప్రణీత (Praneetha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బావ (Bava) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ఏకంగా అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రభస (Rabhasa) సినిమాలో నటించింది.
తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) సరసన అత్తారింటికి దారేది మూవీలో నటించి.. బాపు బొమ్మగా తెలుగు ప్రజల్ని కట్టిపడేసింది. తన అందం, నటన, అభినయం, బొంగరల్లాంటి కళ్లతో యువత గుండెల్ని కొల్లగొట్టిందనడంలో అతిశయోక్తిలేదు.
ఇక కెరీర్ లో ఎదిగే సమయంలో ఈ బ్యూటీ వ్యాపారవేత్త అయిన నితిన్ రాజు (Nitin raju)ను పెళ్లి చేసుకుంది. ప్రణీత, నితిను 2022 లో పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది. కొద్ది రోజుల కిందట మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. అలాగే పిల్లలతో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. పిల్లలిద్దర్ని సంప్రదాయంగా రెడీ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవ్వగా.. ఫ్యాన్స్ క్యూట్ కామెంట్స్ పెడుతుంటారు.
ఇకపోతే తాజాగా ప్రణీత సుభాష్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ఈ నటి కొడుకు పుట్టిన రోజు సందర్భంగా క్యూట్ పిక్స్ పంచుకుంది. అలాగే ‘‘జై మా జీవితాల్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నువ్వు మాతో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. జీవితం ఎంత సరదాగా ఉంటుందో నాకు చూపించినందుకు ధన్యవాదాలు. నిన్ను నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను’’. అంటూ రాసుకొచ్చింది.






