హరిహర వీరమల్లు ట్రైలర్ అప్డేట్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ రెడీనా?

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu Movie).

హరిహర వీరమల్లు ట్రైలర్ అప్డేట్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ రెడీనా?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu Movie). క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ చిత్రానికి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రేపు(బుధవారం) సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ట్రైలర్ అప్డేట్ కూడా ఇస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. విజువల్‌ వండర్‌గా ఈ సినిమా రానుందని దీని వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చేసిన సంస్థ వెల్లడించింది. పనులు పూర్తయినట్లు తెలుపుతూ ఇటీవలే ఫొటో షేర్‌ చేసింది. టీమ్‌లోని వారంతా అంకితభావంతో రెండున్నర ఏళ్లకు పైగా దీనికోసం వర్క్‌ చేసినట్లు తెలిపింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకుడు సినిమాటిక్‌ అనుభూతిని పొందుతారని.. దర్శకుడు ఎంతో అద్భుతంగా దీన్ని రూపొందించారని సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని వీఎఫ్‌ఎక్స్‌ను చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలిభాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. ట్వీట్

Next Story