- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: సినిమా కంపల్సరీ కాదు
టికెట్ ధరల పెంపు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... సినిమా చూడడం అనేది తప్పనిసరి చేయాల్సిన పని కాదు. ఎవరూ కూడా మనల్ని గన్ పాయింట్ పెట్టి మొదటి రోజే సినిమా చూడండి అని చెప్పరు. టికెట్ ధరలపై పెంచిన 18 శాతం ప్రభుత్వానికే వెళుతుంది అని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ ఉప ముఖ్య మంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఏ సినిమా వారు టికెట్ ధర పెంపు కోసం ప్రభుత్వాన్ని కోరిన వాటికి అప్రూవల్ ఇస్తున్నారు. దానిపై కొంతమంది అలా ఎందుకు ఇస్తున్నారు అని పెద్ద స్థాయిలో రగడ చేస్తున్న వారు కూడా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో హీరోగా నటించాడు.
ఈ మూవీని మార్చ్ 19వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి కూడా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించాడు. టికెట్ ధరలను పెంచుతున్నారు అని కొంతమంది అంటున్నారు. అలా పెంచడానికి ఒక కారణం ఉంది. సినిమా చూడడం అనేది తప్పనిసరి చేయాల్సిన పని కాదు. ఎవరూ కూడా మనల్ని గన్ పాయింట్ పెట్టి మొదటి రోజే సినిమా చూడండి అని చెప్పరు.
టికెట్ ధరలపై పెంచిన 18 శాతం ప్రభుత్వానికే వెళుతుంది. పెంచకపోతే కొంతమంది బ్లాక్ టికెట్ల రూపంలో దానిని ఎక్కువ ధరకు అమ్ముతారు, అది ప్రభుత్వానికి రాకుండా వేరే వారికి వెళుతుంది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, తమన్ సంగీతం అందించారు.






