అల్లు అర్జున్ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-08 14:33:28.0  )
అల్లు అర్జున్ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా, అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నడుస్తోందని సోషల్ మీడియాలో తరచూ వార్తలు చూస్తూనే ఉన్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ(YCP) అభ్యర్థికి అల్లు అర్జున్(Allu Arjun) మద్దతు ఇచ్చిన నాటి నుంచే ఇవి ప్రారంభమయ్యాయని మెగా ఫ్యాన్స్(Mega Fans) ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మెగా, అల్లు వార్‌కు చెక్ పెట్టేలా అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 సక్సెస్ మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు..

‘కల్యాణ్ బాబాయ్ థాంక్యూ సో మచ్’ అని పర్సనల్‌గా మరోసారి రిపీట్ చేసి చెప్పారు. దీంతో పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పుష్ప-2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదరగొడుతోంది. తొలి రోజు రూ.294 కోట్లతో భారతీయ సినీ చరిత్రలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప-2... రెండ్రోజుల్లో రూ.449 కోట్లతో మరో రికార్డు సెట్ చేసింది. అత్యంత వేగంగా రూ.449 కోట్లు కొల్లగొట్టిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప-2 చరిత్ర సృష్టించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed