- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు హీరోయిన్లతో పవన్ కల్యాణ్ స్టెప్పులు.. టాప్ లేచిపోనున్న ‘వీరమల్లు’ నెక్ట్స్ సాంగ్
పవర్ స్టార్(Power Star) పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో హరిహర వీరమల్లు(Harihara Veeramallu) ఒకటి. దీనికి క్రిష్ జాగర్లమూడితో పాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్(Power Star) పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో హరిహర వీరమల్లు(Harihara Veeramallu) ఒకటి. దీనికి క్రిష్ జాగర్లమూడితో పాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ సమ్మర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు గతంలో అధికారిక ప్రకటన సైతం చేశారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తి చేయాలని అటు మేకర్స్‌తో పాటు హీరో పవన్ కల్యాణ్ కూడా భావిస్తున్నారట. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాట అందరినీ ఆకట్టుకున్నది. స్వయంగా ఆ పాటను పవన్ కల్యాణే పాడటంతో మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
‘మాట వినాలి.. గురుడా మాట వినాలి’ అంటూ ఉండే ఈ లిరిక్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటపై లక్షల్లో రీల్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రెండో పాటను ఫిబ్రవరి రెండోవారంలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నహాలు చేస్తోందట. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ డైరెక్ట్ చేశారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), ప్రముఖ హీరోయిన్ పూజిత పొన్నాడ(Poojitha Ponnada)తో కలిసిన పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేయనున్నాడట. చాలా కాలం తర్వాత ఇద్దరు హీరోయిన్లతో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేయబోతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా రంగమ్మత్తగా రంగస్థలంలో రామ్ చరణ్‌తో కలిసిన అదరగొట్టిన అనసూయతో డిప్యూటీ సీఎం స్టెప్పులు వేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన అప్డేట్‌ను గతంలోనే అనసూయ ఇచ్చేసింది. ఓ టీవీ షోలో పాల్గొన్న అనసూయ.. పవన్ కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్ చేశానని చెప్పడంతో అంతా అరిచారు. తాజాగా ఆ పాట విడుదలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. ఇటు అనసూయ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లుతో పాటు పవన్ కల్యాణ్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ, హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లకు కూడా పవన్ కల్యాణ్ డేట్స్ సర్దుబాటు చేస్తున్నారు. ఓజీ షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తి కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కు పవన్ కల్యాణ్ ఎక్కువ టైమ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.






