- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ నటుడు బాలకృష్ణకు శుభాకాంక్షాలు తెలిపిన పవన్ కళ్యాణ్
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు(Padma Awards) ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు(Padma Awards) ప్రకటించింది. సినీ, సేవా రంగాల్లో చేసిన సేవలను గుర్తించి అవార్డులు అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ వరించింది. నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి ఈ అవార్డు దక్కింది. దీంతో బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఐదు దశాబ్దాలకుపైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ(Balakrishna) పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆయన హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఎన్నో సేవలందించారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. పద్మ పురస్కారాలకు ఎంపికైన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ఎక్స్‌లో పవన్ కళ్యాణ్ పోస్టు పెట్టారు.






