- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్.. సెలబ్రిటీలు స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమీ తెలియకుండా కుక్కల్లాగా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సిందూర్‌పై స్పందించారు. భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ #AllEyesOnRafa

దిశ, ఫీచర్స్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సిందూర్‌పై స్పందించారు. భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ #AllEyesOnRafa విషయంలో సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందించారని.. ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ కావట్లేదని ప్రశ్నించారు. దీనిపై మీ అభిప్రాయమేంటో చెప్పాలని కోరారు. ఇక ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. సెలబ్రిటీలు ఈదేశాన్ని నడపట్లేదని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘సెలబ్రిటీలు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. దేశంపై ప్రేమను చాటుతున్నారు. వారిపట్ల టూమచ్ అటెన్షన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సింది సెలబ్రిటీలు దేశాన్ని రన్ చేయట్లేదు. దేశం గురించి ప్రతి అణువు తెలిసిన రాజకీయ నాయకులు చూసుకుంటున్నారు. సో.. ఇక్కడ ఇది టాపిక్ కాదు. సెలబ్రిటీల గురించి ఎక్కువగా చర్చించకూడదు’’ అని సూచించారు.
ఇక ఈ సమయంలో యాంటీ నేషనల్ కామెంట్స్, పోస్టులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ముఖ్యంగా సెలబ్రిటీలు ఇలాంటి కామెంట్స్ చేస్తే కేసులు పెడుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ కన్సిడరేషన్‌లోకి తీసుకుని వ్యవహరించాలని.. ‘‘ఏమీ తెలియకుండా సోషల్ మీడియాలో ఈ కుక్కల మాదిరిగా’’ అరవకూడదన్నారు.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation
- pawankalyan
- celebrities






