ఒకే వేదికపై పవన్ కల్యాణ్, అల్లు అర్జున్.. ఈసారి సెలబ్రేషన్స్ అదిరిపోవడం ఖాయం?

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-21 14:10:16  IST  )

మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల మధ్య ఇటీవల గ్యాప్ వచ్చిందనే కథనాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఒకే వేదికపై పవన్ కల్యాణ్, అల్లు అర్జున్.. ఈసారి సెలబ్రేషన్స్ అదిరిపోవడం ఖాయం?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల మధ్య ఇటీవల గ్యాప్ వచ్చిందనే కథనాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ(YCP) ఎమ్మెల్యే అభ్యర్థి తరపున అల్లు అర్జున్(Allu Arjun) ప్రచారం వివాదాస్పదంగా మారింది. దీంతో అప్పటినుంచి మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇరువురి ఫ్యాన్స్.. మాటల యుద్ధం కొనసాగింది. బన్నీ నటించిన పుష్ప-2 విడుదల సమయంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు మరింత చిచ్చు పెట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోవడంతో మెగా అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులు కూడా బన్నీ తీరును తప్పుబట్టారు.

ఈ కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) పరామర్శించకపోవడాన్ని బన్నీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు అల్లు అర్జున్ అపాయింట్మెంట్ అడిగినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు అనుమతి దక్కలేదు. దీంతో బన్నీ మరింత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు బన్నీ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేశారనీ వార్తలు వచ్చాయి. పుష్ప-2 హిట్‌‌తో పాటు కలెక్షన్లను చూపెడుతూ సోషల్ మీడియాలో చరణ్‌ సినిమాపై విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి. దీంతో మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లుగా ప్రచారం ఊపందుకున్నది.

తాజాగా.. ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టేలాగా బన్నీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీన పిఠాపురం(Pithapuram) వేదికగా జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ(Jana Sena Formation Day) వేడుకలకు రావాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇదే గనుక నిజమైన గతకొన్నాళ్లుగా వైరల్‌ అవుతున్న అనేక వార్తలకు చెక్ పెట్టే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజం కావాలని కూడా కోరుకుంటున్నారు. ఇద్దరిని ఒకేచోట చూసి చాలా కాలం అయిందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.




Next Story