- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్-దేవాకట్ట కాంబో ఫిక్స్?
పవన్ కళ్యాణ్-దేవకట్టా కాంబినేషన్‌లో సినిమా రానున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయన ఇక సినిమాలకు దూరంగా ఉంటారని చాలా మంది భావించారు. అయితే పవన్ మాత్రం రాజకీయాలు, సినిమాలు రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నికల ముందు ఒప్పుకున్న మూడు చిత్రాలను పూర్తి చేసి విడుదల చేశారు. కొంతకాలం క్రితమే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో క్రేజీ దర్శకుడితో కూడా సినిమా చేయడానికి పవన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తెలుగు చిత్ర పరిశ్రమలో పొలిటికల్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడనే పేరున్న దేవ కట్టా దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సురేందర్ రెడ్డి, దేవ కట్టా ఇద్దరితో ఏకకాలంలో సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్థానం, రిపబ్లిక్ వంటి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు కావడం, పవన్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతుండటంతో వీరిద్దరి కలయికలో సినిమా వస్తే దానిపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






