ఇద్దరు కమెడియన్లతో పవన్ బాసంశెట్టి నెక్స్ట్ మూవీ

by Pulgam srinivas |

‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి తన తదుపరి సినిమాను యోగి బాబు, సత్యలతో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరు కమెడియన్లతో పవన్ బాసంశెట్టి నెక్స్ట్ మూవీ
X

దిశ, వెబ్ డెస్క్: నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘రంగబలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన పవన్ బాసంశెట్టి ఆ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికే కొంతకాలం గడిచినా ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు. మధ్యలో తన నెక్స్ట్ మూవీని కూడా నాగశౌర్యతోనే చేయనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం పవన్ బాసంశెట్టి కొత్త ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు కమెడియన్లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం, ఈ మూవీని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించనున్నారని తెలుస్తోంది. ఇందులో తమిళ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో కనిపించనుండగా, సత్య మరో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఇద్దరు కమెడియన్లతో పవన్ బాసంశెట్టి ఓ వినోదాత్మక గ్రామీణ కథను తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుందని సమాచారం.

Next Story