- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Patas Faima: హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది: ఫైమా
జబర్దస్త్ కమెడియన్ పటాస్ ఫైమా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ కమెడియన్ పటాస్ ఫైమా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె జబర్దస్త్, ఇతర కామెడీ షోలలో తన నటన ద్వారా బాగా గుర్తింపు పొందింది. పటాస్ ఫైమా, పటాస్ ప్రవీణ్ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అది నిజమో కాదో అని స్పష్టంగా తెలియదు. వారు కలిసి రీల్స్ అండ్ వీడియోలు కూడా చేశారు ఫైమా ఓ సందర్భంలో కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది.
ఒక వీడియోలో బ్రేకప్ గురించి స్పష్టం చేసింది. తాను తనను తాను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్ లో ఫైమా నరేష్ తో కలిసి ఒక జోడీగా కనిపించింది. ఆమె తన ప్రత్యేకమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఫైమా జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొన్నప్పుడు.. ఆమె తన అద్భుతమైన నటనతో అలాగే కామెడీ టైమింగ్‌తో బాగా పేరు తెచ్చుకుంది.
అయితే ఫైమా కేవలం షోల్లోనే కాకుండా.. ఓ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఏప్రిల్ 18 వ తారీకున విడుదలైన డియర్ ఉమ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రొమాంటిక్ సినిమాలో పృథ్వీ అంబర్ అండ్ సుమయ రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీతోనే సుమయ రెడ్డి సినీ ఎంట్రీ ఇచ్చింది.
గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన అమ్మాయిగా డియర్ ఉమ లో కనిపించింది. ఈమెకు ఫ్రెండ్ క్యారెక్టర్‌గా పటాస్ ఫైమా నటించింది. అయితే ఫైమా ఈ మూవీలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని తాజాగా వెల్లడించింది. ముఖ్యంగా హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో చేయడం ఇంకా ఆనందంగా ఉందని తెలిపింది. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది.
అలాగే చాలా అవకాశాలు వచ్చాయని, కానీ టైమ్ కుదరక.. కొన్ని స్టోరీస్ నచ్చక చేయలేదని పేర్కొంది. కానీ ఈ స్టోరీ చెప్పగానే బాగా నచ్చిందని వెంటనే ఓకే చెప్పేశానని వెల్లడించింది. ప్రెజెంట్ ఫైమా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






