- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోయిన్ వక్షోజాలపై గట్టిగా కొట్టిన వ్యక్తి.. నొప్పి భరించలేక విలవిలలాడిపోయి.. (వీడియో)
హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు, వివక్ష గురించి గట్టిగా మాట్లాడుతుంది. తప్పు ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తూనే ఉంది.

దిశ, సినిమా : మాలీవుడ్ హీరోయిన్ పార్వతి తిరువోతు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు, వివక్ష గురించి గట్టిగా మాట్లాడుతుంది. తప్పు ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తూనే ఉంది. విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సభ్యురాలిగా సేవలు అందిస్తుంది. ఈ క్రమంలోనే ‘ది మేల్ ఫెమినిస్ట్’ పాడ్ కాస్ట్‌లో తన బాల్యంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘మా అమ్మను రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేసి.. నాన్న చేయి పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నా. ఒకాయన సడెన్‌గా నా వక్షోజాలపై గట్టిగా కొట్టాడు. ఠప్ అని శబ్దం వచ్చేలా కొట్టడంతో చాలా నొప్పివచ్చింది’ అని తెలిపింది. మహిళలు చిన్న వయసు నుంచే ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, అసౌకర్య సంఘటనల గురించి పంచుకుంది. అలాగే అమ్మ రోడ్డుపై నడిచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేదని.. పురుషుల చేతులపై ఓ కన్ను వేయాలని హెచ్చరించేదని తెలిపింది. ఈ మాటలు చాలా హృదయవిదారకంగా ఉండగా.. ఇలాంటి అనుభవాలు బాలికలు, స్త్రీలకు సాధారణంగా మారిపోయాయని.. ఇందులో మార్పు రావాలని సూచించింది.






