శ్రీలీల సినిమాకు అరుదైన ఘనత

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-16 11:49:54  IST  )

శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ‘పరాశక్తి’ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రవి మోహన్, శ్రీలీల, అథర్వ మురళీ ప్రధాన పాత్రల్లో కనిపించిన మూవీకి సుధా కొంగర దర్శకులు.

శ్రీలీల సినిమాకు అరుదైన ఘనత
X

దిశ, సినిమా : శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ‘పరాశక్తి’ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రవి మోహన్, శ్రీలీల, అథర్వ మురళీ ప్రధాన పాత్రల్లో కనిపించిన మూవీకి సుధా కొంగర దర్శకులు. కాగా ఈ చిత్రం 2026 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రాటర్‌డామ్ (AZ)కు అధికారికంగా సెలెక్ట్ అయిందని ప్రకటించారు మేకర్స్. ఆకాష్ భాస్కరన్ నిర్మించిన సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. మ్యూజిక్ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చిందని విమర్శకులు ప్రశంసించారు. తమిళ భాషలో చారిత్రక రాజకీయ యాక్షన్ డ్రామాగా వచ్చిన చిత్రం.. 1960లలో తమిళనాడులో జరిగిన యాంటీ-హిందీ ఉద్యమం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Next Story