నా ప్రియుడి వల్లనే శ్రీలీల కొత్త సినిమా ఆడుతుంది.. సింగర్ సంచలన కామెంట్స్

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-10 11:01:21  IST  )

తమిళ్ హీరో రవి మోహన్ ఈ మధ్య వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లలు పుట్టాక దాదాపు 15ఏళ్ల బంధాన్ని బ్రేక్ చేస్తూ భార్యతో విడాకులు తీసుకున్నాడు.

నా ప్రియుడి వల్లనే శ్రీలీల కొత్త సినిమా ఆడుతుంది.. సింగర్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా : తమిళ్ హీరో రవి మోహన్ ఈ మధ్య వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లలు పుట్టాక దాదాపు 15ఏళ్ల బంధాన్ని బ్రేక్ చేస్తూ భార్యతో విడాకులు తీసుకున్న ఆయన.. ప్రస్తుతం సింగర్, నటి కెనిషాతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆమె కారణంగానే భార్యతో విడిపోయాడనే టాక్ కూడా ఉంది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే రవి మోహన్ కీలక పాత్రలో కనిపించిన ‘పరాశక్తి’ మూవీ రిలీజ్ కాగా ఈ సినిమా చూసిన కెనిషాను రిపోర్టర్స్ సినిమా ఎలా ఉందని ప్రశ్నించారు. రవి మోహన్ విలన్ కదా? అని అనగా.. విలనా లేక హీరోనా అనేది కాదు.. రవి వల్లనే సినిమా ఆడుతుందని.. ఆయనే నంబర్ వన్ అని చెప్పుకొచ్చింది ప్రియురాలు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరో వైపు రవి విలనిజంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఈ చిత్రంలో హీరో శివ కార్తికేయన్ కాగా హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. అథర్వ మురళి హ్యాండ్‌సమ్ బాయ్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

Next Story