- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Paradha: అనుపమ ‘పరదా’ నుంచి థీమ్ సాంగ్ విడుదల.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్..
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) ప్రజెంట్ నటిస్తున్న తాజా సినిమా ‘పరదా’(Paradha).

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) ప్రజెంట్ నటిస్తున్న తాజా సినిమా ‘పరదా’(Paradha). దీనికి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీధర్ మక్కువ, విజయ్ దొంకాడ ఆనంద మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో దర్శన రాజేంద్ర(Darshana Rajendran), టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సంగీత(Sangeetha) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..’ థీమ్ ఆఫ్ పరదా సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. గోపి సుందర్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌లోని లిరిక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. కాగా సంప్రదాయపు కట్టుబాట్లు మహిళలను ఎలా అణచివేస్తున్నాయి. ఎలా ఎదగకుండా అణగదొక్కుతున్నాయి.. వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే సోషియో డ్రామా కథాంశంతో ఈ సినిమా రాబోతుంది.






