- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పేపర్ బాయ్’ ఫేమ్ డైరెక్టర్ కొత్త సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
‘పేపర్ బాయ్’ ఫేమ్ డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘అరి’.

దిశ, సినిమా: ‘పేపర్ బాయ్’ ఫేమ్ డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను దసరా స్పెషల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన ‘అరి’ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జయశంకర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక మంచి మెసేజ్‌తో రూపొందింది. కచ్చితంగా ఇది అందరిని ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నాము’ అని తెలిపారు.






