- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘పాపం ప్రతాప్’
పాపం ప్రతాప్ చిత్రం ఈ రోజు నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటుడు తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించగా, ఎస్.పి. దుర్గా నరేష్ దర్శకత్వం వహించారు. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్లపై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాధి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైంది. భారీ ప్రచార కార్యక్రమాల వల్ల విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదల అనంతరం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకోగా, ఈరోజు నుంచి ఈ సినిమా ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో అజయ్ ఘోష్, రఘు బాబు, రాశి కీలక పాత్రల్లో నటించగా, సంగీతాన్ని కే.ఎం. రాధాకృష్ణన్ అందించారు.






