- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సంస్థ చేతుల మీదుగా రీ-రిలీజ్ కానున్న 'పంజా'
'పంజా' సినిమాను వెస్ట్ గోదావరి ప్రాంతంలో కాకినాడ టాకీస్ సంస్థ రీ-రిలీజ్ చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పంజా' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సారా-జేన్ డయాస్, అంజలి లావానియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అడివి శేష్ కీలక పాత్రలు పోషించారు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్, సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంతల నిర్మించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. 2011లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
అయితే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత స్టైలిష్ చిత్రాల్లో ఒకటిగా 'పంజా' ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వెస్ట్ గోదావరి ప్రాంతంలో కాకినాడ టాకీస్ సంస్థ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సంస్థ వెస్ట్ గోదావరి ప్రాంతానికి సంబంధించిన విడుదల హక్కులను సొంతం చేసుకోవడంతో, ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. మరి రీ-రిలీజ్‌లో 'పంజా' ఎలాంటి స్పందనను దక్కించుకుంటుందో చూడాలి.






