ఇంటెన్స్ లుక్‌లో ‘పాంచ్‌మినార్’పోస్టర్

by Chukka Sudharani |

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పాంచ్‌మినార్’.

ఇంటెన్స్ లుక్‌లో ‘పాంచ్‌మినార్’పోస్టర్
X

దిశ, సినిమా: యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పాంచ్‌మినార్’. రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్‌పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌తో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు. రాజ్ తరుణ్, అజయ్ ఘోష్, రాశి సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రస్టింగ్‌గా ఆకట్టుకుంటోంది. ఇందులో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story