Yash: యశ్ మూవీలో మరో క్రేజీ బ్యూటీ.. నెట్టింట పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

హీరో యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’.

Yash: యశ్ మూవీలో మరో క్రేజీ బ్యూటీ.. నెట్టింట పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: హీరో యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రంపై రోజుకో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ జాయిన్ అయినట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఇందులో ‘పంచాయత్’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సాన్వికను ఓ ప్రత్యేక పాత్ర కోసం సంప్రదించారట మేకర్స్.

స్టోరీ నచ్చడంతో సాన్విక కూడా ఓకే చేసినట్లు తెలుస్తుండగా.. త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నట్లు టాక్. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్’ మూవీని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యశ్, వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటికే హీరోయిన్‌గా కియారా అద్వానీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన నటీనటులపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story