కంగ్రాట్యులేషన్స్ అంటూ ఆ హీరో సినిమాపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

by Gugulothu.Kavitha |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

కంగ్రాట్యులేషన్స్ అంటూ ఆ హీరో సినిమాపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతను మారుతీ డైరెక్షన్‌లో నటించిన ‘ది రాజాసాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకు థమన్ సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రభాస్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రభాస్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టాడు. అందులో టాలీవుడ్ హీరో ఆది నటించిన సినిమా పై ప్రశంసలు కురించించారు.

‘ఆది అండ్ టీమ్‌కు కంగ్రాట్యూలేషన్స్.. శంబాల సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ సాధించింది’ అంటూ రాసుకొస్తూ మూవీ పోస్టర్ షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా హీరో ఆది సాయికుమార్(Adi Sai kumar), అర్చన అయ్యర్(Archana Ayyar) జంటగా నటించిన ‘శంబాల’(Shambala) సినిమాకు యుగంధర్ ముని(Yugandhar Muni) దర్శకత్వం వహించారు. ఇక షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అయితే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయంతో పాటు కలెక్షన్లు కూడా బాగానే రాబడుతోంది.



Next Story