నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. నీ పిచ్చిని చూడానికి ఎదురుచూస్తున్నానంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషెష్

by Kodari Anjali |

ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. నీ పిచ్చిని చూడానికి ఎదురుచూస్తున్నానంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషెష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రెబల్ స్టార్‌కు తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, పౌర్ణమి, మున్నా, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, రెబెల్, వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. కొన్ని సినిమాలతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఘోర పరాజయం చవిచూసినప్పటికీ.. బాహుబలి, సలార్, కల్కి 2898 వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్

సొంతం చేసుకున్నారు. దర్శకదీరుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ రెబల్ స్టార్‌ క్రేజ్‌ను డబుల్ చేశారు. అద్భుతమైన కంటెంట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చి... తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక ప్రభాస్ నటనకు అయితే అభిమానులకు పిచ్చేక్కిపోయిందనడంలో అతిశయోక్తిలేదు. ప్రభాస్ తనలోని కొత్త యాక్టర్‌ను బయటకు తీసుకొచ్చి.. నెటిజన్లను మెప్పించారు.

ఇకపోతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే రెబల్ స్టార్ తాజాగా సలార్ బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు బర్త్ డే విష్ చేశారు. ‘‘నా సలార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు... పార్ట్-2 లో నీ పిచ్చిని చూడటానికి ఎదురు చూస్తున్నాను. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ ప్రభాస్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.





Next Story