హ్యాండ్‌సమ్ లుక్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వింటేజ్ రెబల్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..

by Gugulothu.Kavitha |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ఫౌజీ’(Fouji) ఒకటి.

హ్యాండ్‌సమ్ లుక్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వింటేజ్ రెబల్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ఫౌజీ’(Fouji) ఒకటి. దీనికి దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో డార్లింగ్ సరసన యంగ్ బ్యూటీ ఇమాన్వీ(Imanvi) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ క్రమంలో తాజాగా మన డార్లింగ్‌ కొత్త లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫౌజీ షూటింగ్ సెట్‌లో ప్రభాస్ ఓ అభిమానితో ఫొటో దిగగా అది కాస్త వైరల్‌గా మారింది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి లుక్ రాలేదని, ప్రభాస్ చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వింటేజ్ రెబల్ ఈజ్ బ్యాక్ అని పోస్టులు పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రభాస్ లేటెస్ట్ లుక్‌ని చూసేయండి.




Next Story