సింగరేణి కార్మికుల బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా మూవీ.. హీరో ఎవరంటే?

by Chukka Sudharani |

‘ది 100’ సినిమాతో రీసెంట్‌గా హిట్ కొట్టిన హీరో సాగర్.. ఇప్పుడు మరో వినూత్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అవుతున్నారు.

సింగరేణి కార్మికుల బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా మూవీ.. హీరో ఎవరంటే?
X

దిశ, సినిమా: ‘ది 100’ సినిమాతో రీసెంట్‌గా హిట్ కొట్టిన హీరో సాగర్.. ఇప్పుడు మరో వినూత్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు ముందుకు వచ్చాడు ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ డైరెక్టర్ జీవన్ రెడ్డి. పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించగా.. ఇందులో సింగరేణి కార్మికుల దుర్భలమైన జీవితాలు, వారి కష్టాల్ని తెరపై చూపించనున్నట్లు తెలిపారు. మైనింగ్ ప్రాంతాల కఠినమైన వాతావరణం, కార్మికుల దినచర్య, వారి త్యాగాలు వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతున్నారు మేకర్స్.

పండుగా సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇవ్వగా.. ఇందులో ప్రధాన పాత్రలో హీరో సాగర్ నటించనున్నారు. స్వతాహాగా సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన సాగర్.. తాను చూసిన జీవితాల్ని, పాత్రల్ని తెరపై చూపించడం ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపారు. నవంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టుగా టీం ప్రకటించింది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే తెలియజేయనున్నారు. కాగా.. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో రాబోతున్న ఈ మూవీ కోసం ప్రముఖ నటుల్ని ప్రధాన పాత్రల కోసం తీసుకోనున్నట్లు తెలిపారు మేకర్స్.

Next Story