- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాన్ ఇండియా చిత్రం నాగబంధం రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
రిలీజ్‌కు సిద్దమైన విరాట్ కర్ణ, నభా నటేష్ ‘నాగబంధం’.

దిశ, సినిమా: అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ ‘నాగబంధం’ మూవీ అద్భుతమైన కంటెంట్‌తో సంచలనం సృష్టిస్తోంది. NIK స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా.. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, రిషబ్ సాహ్ని, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో భారతీయ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ “నమో రే” కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మేరకు ఓ పవర్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మా పాన్-ఇండియా చిత్రం 'నాగబంధం' జులై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము!’ అని తెలిపారు. అంతే కాకుండా.. త్వరలో టీజర్ కూడా రానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.






