- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ ఫ్రైడే స్పెషల్.. టొవినో థామస్ సినిమా నుంచి అప్డేట్
టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’ ట్రైలర్ రేపు రాబోతున్నట్లు తెలిపారు మేకర్స్.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఆకట్టుకోగా.. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఇక ప్రమోషన్స్ భాగంగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గుడ్ ఫ్రైడే స్పెషల్‌గా రేపు 5వ తేదీన ట్రైలర్ రాబోతున్నట్లు తెలుపుతూ.. ‘సిద్ధంగా ఉండండి.. నిరీక్షణ దాదాపు ముగిసింది.. 05-04-2026 ఉదయం 11:11 గంటలకు ట్రైలర్ రాబోతున్నది.. 'పళ్లిచట్టంబి' ప్రపంచాన్ని వీక్షించండి.. ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.






