క్రికెటర్ స్మృతి మంధనతో పెళ్లి రద్దు.. పలాష్ ముచ్చల్ సంచలన ప్రకటన

by Malleboina Mahesh |

క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూసిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్‌తో పెళ్లి రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

క్రికెటర్ స్మృతి మంధనతో పెళ్లి రద్దు.. పలాష్ ముచ్చల్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూసిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్‌తో పెళ్లి రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే.. పలాష్ ముచ్చల్ సంచలన ప్రకటన విడుదల చేశాడు. ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా పలాష్ ముచ్ఛల్ తన వ్యక్తిగత సంబంధం నుంచి వైదొలగుతున్నట్లు Instagram ద్వారా ప్రకటించారు. ఆయన తన పోస్టులో.. "నేను నా జీవితంలో ముందుకు సాగాలని, నా వ్యక్తిగత సంబంధం నుండి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను,". తనకు అత్యంత పవిత్రమైన వ్యక్తిగత విషయం గురించి నిరాధారమైన పుకార్లకు (Baseless rumours) ప్రజలు చాలా తేలికగా స్పందించడం చూడటం తనకు చాలా కష్టంగా అనిపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది నా జీవితంలో అత్యంత కష్టతరమైన దశ," అని పేర్కొన్న పలాష్.. తాను తన విశ్వాసాలను పట్టుకుని గౌరవంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటానని తెలిపారు.

అలాగే సమాజంపై స్పందిస్తూ.. మూలాలు తెలియని గాసిప్‌ల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి ముందు మనం ఆలోచించాలని ఆయన కోరారు. ముఖ్యంగా, తమ గురించి తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను (false and defamatory content) వ్యాప్తి చేస్తున్న వారిపై తన బృందం కఠినమైన న్యాయపరమైన చర్యలు (strict legal action) తీసుకోబోతోందని పలాష్ ముచ్చల్ స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో దయతో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దాదాపు పెళ్లి పీటల వరకు వెళ్లిన వారి సంబంధం.. అనుకొని ఘటనతో తెగిపోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.

Next Story