ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి మృతి.. కుళ్లిపోయిన స్థితిలో శవం.. బాడీని తీసుకోలేమంటున్న తండ్రి, సోదరుడు..

by Sujitha Rachapalli |

పాకిస్తానీ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ మరణించింది. కరాచీలోని తన అపార్ట్‌మెంట్‌లో నిర్జీవంగా కనిపించింది. ఆమె శరీరం కుళ్ళిపోయిన స్థితిలో ఉండటం వల్ల బహుశా రెండు వారాల ముందు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి మృతి.. కుళ్లిపోయిన స్థితిలో శవం.. బాడీని తీసుకోలేమంటున్న తండ్రి, సోదరుడు..
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తానీ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ మరణించింది. కరాచీలోని తన అపార్ట్‌మెంట్‌లో నిర్జీవంగా కనిపించింది. ఆమె శరీరం కుళ్ళిపోయిన స్థితిలో ఉండటం వల్ల బహుశా రెండు వారాల ముందు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఏడేళ్లుగా ఒంటరిగా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆమె.. సహజంగానే మరణించి ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

కాగా ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన, కొన్ని రోజులుగా నటి కదలికలు కనిపించకపోవడంతో పొరుగింటివారు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అక్కడకు చేరుకుని ఆమె అపార్ట్‌మెంట్ ఓపెన్ చేశారు. లోపలి నుండి లాక్ చేయబడి ఉండగా.. ప్రాథమికంగా ఎటువంటి అనుమానాస్పద కారణాలు కనిపించలేదని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఆమె మృతికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించవచ్చని తెలిపారు. ఇక మరోవైపు ఆమె బాడీని తీసుకునేందుకు తండ్రి, సోదరుడు ముందుకు రాకపోగా.. ఆమెతో తమకు సంబంధం లేదని, శవాన్ని ఏమైనా చేసుకోమని చెప్పడం శోచనీయం.

Next Story