పహల్గామ్ టెర్రర్ అటాక్.. ట్రెండింగ్‌లో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-04-25 12:27:21  IST  )

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’(Fouji) ఒకటి.

పహల్గామ్ టెర్రర్ అటాక్.. ట్రెండింగ్‌లో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’(Fouji) ఒకటి. హను రాఘవపూడి(Hanu /raghavapudi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ఇమాన్వీ(Imanvi) హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా, బ్రిటీష్ సైన్యంలో సోల్జర్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ నిర్మాణల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ దాడి ఘటనలో పాక్ హస్తం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తెలియడంతో గతంలో లాగా దాయాదిపై సర్జికల్ స్ట్రైక్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఉగ్రదాడిని యావత్ భారత చిత్రసీమ ముక్త కంఠంతో ఖండించింది. టాలీవుడ్ టు బాలీవుడ్ అందరూ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో ఈ ఉగ్రవాద దాడి తర్వాత కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్లు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నారు.

అందులో ఇమాన్వీ అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం ఆమె మూలాలు పాకిస్తాన్ దేశంలో ఉండడమే. పాక్ మాజీ మిలిటరీ అధికారి ఇక్బాల్ కుమార్తెనే ఇమాన్వి. పాకిస్తాన్ లోని కరాచీకి చెందిన ఇమాన్వీ కుటుంబం ప్రస్తుతం అమెరికాలో స్థిర పడింది. ఈ క్రమంలోనే ఇమాన్వీపై నెట్టింట వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫౌజీ సినిమా నుంచి ఆమెను తొలగించాలంటూ నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. పాక్ నటులకు భారతీయ సినిమాల్లో అవకాశాలు కల్పించవద్దని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడికి, ఇమాన్వీకి ముడి పెట్టడం ఏంటని మరికొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story