- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి వచ్చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల విషయంలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. అలా ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక నయనతార(Nayanatara) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్(Venkatesh) కీ రోల్ ప్లే చేసింది. అయితే ఈ సినిమాకు నిర్మాత సాహు గారపాటితోపాటు మెగా డాటర్ సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ గ్రూప్ 50 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.
థియేటర్‌లో రిలీజైన 4 వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురావాలనే ఒప్పందం మీద డీల్ కుదిరింది. దీని ప్రకారం ఫిబ్రవరి 11న మన శంకర వరప్రసాద్ గారు మూవీ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ మూవీ ఓటీటీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది.






