- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా రాజు గారు వస్తున్నారు దరువేసుకొండ్ర.. అనగనగా ఒక రాజు ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju).

దిశ, వెబ్‌డెస్క్: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది.
మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. సంక్రాంతి కానుకగా.. జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘మా రాజు గారు వస్తున్నారు దరువేసుకొండ్ర.. అనగనగా ఒక రాజు ట్రైలర్ జనవరి 7వ తేదీన సాయంత్రం 6:04 గంటలకు వస్తుంది.. ఈ సంక్రాంతికి ఇంటింటా నవ్వుల మోతె.. అనగనగా ఒక రాజు ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో జనవరి 14, 2026న రిలీజ్ కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో నవీన్ పొలిశెట్టి నల్లటి కళ్లజోడు పెట్టుకుని ఊయలలో కూర్చోని రాజులా ఒక హ్యాండ్ పైకి అని మరో హ్యాండ్‌ను తన తొడలపై పెట్టుకొని ధీమాగా చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More..






