బిట్‌కాయిన్ స్కాములో రాజ్ కుంద్రాకు కోర్టు సమన్లు

by Muthe.Rajitha |

బిట్‌కాయిన్ స్కాములో రాజ్ కుంద్రాకు కోర్టు సమన్లు
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరో భారీ స్కాములో ఇరుక్కున్నారు. బిట్‌కాయిన్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాజ్ కుంద్రాకు ముంబైలోని స్పెషల్ PMLA కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన కోర్టు.. రాజ్ కుంద్రాతో పాటు దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ సతీజాలను జనవరి 19న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

అమిత్ భరద్వాజ్ నడిపిన గెయిన్‌బిట్‌కాయిన్ స్కామ్‌లో వేల కోట్ల రూపాయల మోసం జరిగిందని, ఈ కేసులో రాజ్ కుంద్రా 2018లో 285 బిట్‌కాయిన్లు (ప్రస్తుత విలువ సుమారు రూ.150 కోట్లు) తీసుకున్నాడని ED ఆరోపిస్తోంది. ఈ డబ్బంతా అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చిన డబ్బు అని ED వాదిస్తోంది. అయితే తాను కేవలం మధ్యవర్తినేనని, ఈ లావాదేవీ తన స్నేహితుడి తరఫున జరిగిందని రాజ్ కుంద్రా చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కుంద్రాకు చెందిన సుమారు రూ.97.79 కోట్ల విలువైన ఆస్తులను ED అటాచ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలోనే కొనసాగుతోంది.

Next Story