పవన్, ప్రభాస్ సినిమాల కంటే మా కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం " కన్నప్ప "(Kannappa).

పవన్, ప్రభాస్ సినిమాల కంటే మా కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం " కన్నప్ప "(Kannappa). ముకేశ్‌ కుమార్‌సింగ్‌(Mukesh Kumar Sing) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్(Prabhas) కనిపించనున్నారు. అలాగే మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్(Mohanlal), కాజల్ అగర్వాల్(Kajal Agarwal), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), శరత్ కుమార్(Sarathkumar).. బ్రహ్మానందం(Brahmanandam), మధుబాల(Madhubala), ముఖేష్ రిషి(Mukesh Rishi) సహా పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఈ చిత్రం జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మంచు విష్ణు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కడ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘కన్నప్ప బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్‌లో ఉంది. నేను కన్నప్ప బడ్జెట్ చెప్తే రేపు పొద్దున్న IT వాళ్ళు మా ఇంటి ముందు క్యూ కడతారు. రాజా సాబ్(Raja Saab), ఓజీ(OG) సినిమాల కంటే మా కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువ’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story