- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన రెండు క్రేజీ సినిమాలు
తాజాగా మృత్యుంజయ్, సితారే జమీన్ పర్ చిత్రాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీలోకి కొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. అందులో రెండు క్రేజీ చిత్రాలు కూడా ఉన్నాయి. అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మృత్యుంజయ్
శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించింది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 6న విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. అయితే భారీ కలెక్షన్లు మాత్రం సాధించలేకపోయింది. ఇక ఈ చిత్రం ఈ రోజు నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సితారే జమీన్ పర్
ఆమిర్ ఖాన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. జెనీలియా ఇందులో కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రానికి ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించారు. 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా ఈ రోజు నుండి సోనీ లీవ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.






