OTT: ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన 'హే బల్‌వంత్'

by Pulgam srinivas |

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హే బల్‌వంత్ చిత్రం మార్చ్ 31వ తేదీ నుండి జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

OTT: ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన హే బల్‌వంత్
X

దిశ, వెబ్ డెస్క్: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత సుహాస్, శివాని నగరం కలిసి నటించిన చిత్రం హే బల్‌వంత్. గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20, 2026న విడుదలైంది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 31వ తేదీ నుండి ఈ చిత్రం జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

డిజిటల్ ప్రేక్షకులను ఈ చిత్రం ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని మొదట 'హే భగవాన్' అనే టైటిల్‌తో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత టైటిల్ మార్చి 'హే బల్‌వంత్' పేరుతో విడుదల చేశారు. ఇందులో నరేష్ కీలకమైన పాత్రలో నటించాడు. ముఖ్యంగా సుహాస్, నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే చిత్ర విడుదలకు ముందు ఈ సినిమాలో ఒక సీక్రెట్ బిజినెస్ ఉంది — అదేంటో కనుక్కోండి అంటూ పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. ఈ ప్రచారం సినిమాపై హైప్ పెంచే విషయంలో బాగా ఉపయోగపడింది.

Next Story