- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల కి "ఒసేయ్ బాలమ్మ"
"ఒసేయ్ బాలమ్మ" అనే షార్ట్ ఫిల్మ్ 2026లో అమెరికాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైందని దర్శకుడు రమణ్ నిమ్మల తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : "ఒసేయ్ బాలమ్మ" అనే షార్ట్ ఫిల్మ్ 2026లో అమెరికాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైందని దర్శకుడు రమణ్ నిమ్మల తెలిపారు. విజయవాడ గుణదలలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 11 వేల ఎంట్రీలు రాగా వాటిలో 50 చిత్రాలే షార్ట్ లిస్ట్ అయ్యాయని, వాటిలో తమ షార్ట్ ఫిల్మ్ ఉండటం గర్వకారణమన్నారు. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీ విభాగానికి ఎంపికైన తొలి తెలుగు లఘుచిత్రంగా ఇది రికార్డు సృష్టించిందని చెప్పారు.
తన చిన్ననాటి వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లో గడిపిన రోజులే ఈ కథకు ప్రేరణగా మారాయని తెలిపారు. ఈ చిత్రాన్ని తెలంగాణలోని నేరడిగుంట అనే గ్రామంలో షూట్ చేశామన్నారు. న్యూయార్క్‌లో మంచి ఉద్యోగం వదులుకొని వ్యక్తిగత అనుభవాల ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే కథలు చెప్పాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని రమణ్ వెల్లడించారు.






