- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్కార్ బెస్ట్ సినిమా రేస్‌లో ఐదు ఇండియన్ సినిమాలు
by Sujitha Rachapalli |
ఆస్కార్ 2026 అవార్డ్స్ (98 అకాడమీ అవార్డ్స్) అప్డేట్ వచ్చేసింది. బెస్ట్ పిక్చర్ కేటగిరీ రిమైండర్ లిస్ట్ రిలీజ్ చేసింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.

X
దిశ, సినిమా : ఆస్కార్ 2026 అవార్డ్స్ (98 అకాడమీ అవార్డ్స్) అప్డేట్ వచ్చేసింది. బెస్ట్ పిక్చర్ కేటగిరీ రిమైండర్ లిస్ట్ రిలీజ్ చేసింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఈ లిస్ట్ ప్రకారం 201 చిత్రాలు బెస్ట్ పిక్చర్ కేటగిరికి అర్హత సాధించగా.. ఇందులో ఐదు ఇండియన్ సినిమాలు ఉండటం విశేషం. ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’, ‘మహావతార్ నరసింహ’, ‘తన్వీ ది గ్రేట్’, ‘సిస్టర్ మిడ్‌నైట్’, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రాలు ఉన్నాయి. దీంతో ఇండియన్ సినిమా లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇక నామినేషన్స్ జనవరి 22న ప్రకటించనున్నారు. మరో వైపు భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా "హోంబౌండ్" (నీరజ్ ఘయవాన్ డైరెక్షన్) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో ఇప్పటికే షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చింది.
Next Story






