Oscars-2025: ఆస్కార్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రం అదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-03 03:33:23  IST  )

లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌‌లో 97వ ఆస్కార్ అకడెమీ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది.

Oscars-2025: ఆస్కార్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రం అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: లాస్‌ ఏంజిల్స్‌ (Los Angeles)లోని డాల్బీ థియేటర్‌‌ (Dolby Theatre)లో 97వ ఆస్కార్ అకడెమీ అవార్డు (Oscar Academy Awards)ల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు హాలీవుడ్‌ స్టార్స్ (Hollywood Stars), వివిధ రంగాల సాంకేతిక నిపుణులు (Technical Experts) ట్రెండీ లుక్‌లో హాజరయ్యారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్టులకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆస్కార్‌ అవార్డుల హోస్ట్‌గా అమేలియా డిమోల్డెన్‌బర్గ్‌ (Amelia Diemoldenberg) వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు బెస్ట్ యానిమేటెడ్ మూవీగా ‘ఫ్లో’ (Flow), ఉత్తమ యానిమేటెడ్ షాట్ ఫిల్మ్‌గా ‘ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్’ ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా అడ్రియన్‌ బ్రాడీ (Adrien Brody) ఎంపికయ్యారు. ‘ది బ్రూటలిస్ట్‌’ ('The Brutalist')లో నటనకు గాను ఆయనకు ఆస్కార్ దక్కింది.

అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌), ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనోరా (సీన్‌ బేకర్‌), ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే - కాన్‌క్లేవ్‌ (పీటర్‌ స్ట్రాగన్‌), ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - వికెడ్‌ (పాల్‌ తేజ్‌వెల్‌), ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ - ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌, ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ - ది సబ్‌స్టాన్స్‌, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - సీన్ బేకర్ (అనోరా), బెస్ట్ మేకప్, హెయిర్ స్టైల్ - ది సబ్‌స్టాన్స్‌, ఉత్తమ సహాయ నటిగా జోయి సల్డానా (ఎమీలియా పెరెజ్) ఆస్కార్‌ను అందుకున్నారు.

Next Story